AP High Court: వారిని లోకల్ గానే పరిగణించండి.. ఎన్టీఆర్ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
AP High Court ప్రభుత్వం తరఫు కౌంటర్ అఫిడవిట్ సమర్పణ అనంతరం లోకల్, నాల్ లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.

AP High Court: వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ లో తమను లోకల్ అభ్యర్థులుగా పరిగణించి, దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకపోవడాన్ని కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను ఏపీకి చెందిన స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తూ వారి దరఖాస్తులను స్వీకరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం తరఫు కౌంటర్ అఫిడవిట్ సమర్పణ అనంతరం లోకల్, నాల్ లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇంటర్ తెలంగాణలో చదివామనే కారణంతో వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ లో తమను లోకల్ అభ్యర్థులుగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా ప్రత్తి పాడుకు చెందిన ఎస్కే ఖమరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.