Venkaiah Naidu VIP Darshans: తిరుమలలో వీఐపీల దర్శనాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
Venkaiah Naidu VIP Darshans దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీదించగా.. అడిషన్ లో ఈవో వెంకయ చౌదరి ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.

Venkaiah Naidu VIP Darshans: తిరుమలలో వీఐపీల దర్శనాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిపి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీదించగా.. అడిషన్ లో ఈవో వెంకయ చౌదరి ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. టీటీడీ నిధుల వ్యయంలో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. టీటీడీ నిధులను శ్రీవారి భక్తుల సౌకర్యాలకే వినియోగించాలన్నారు. ఊరుకో గుడి, బడి ఉండాలని.. బడి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వానిదైతే గుడి నిర్మాణ బాధ్యతను టీటీడీ తీసుకోవాలన్నారు.
Related News