Taxpayers Alert: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్
Taxpayers Alert ఫిషింగ్ అనేది మోసగాళ్లు ఆదాయపు పన్ను శాఖ వంటి విశ్వసనీయ సంస్థలను అనుకరిస్తూ , మీ బ్యాంకు వివరాలు, పాస్ వర్ట్ లు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేస్తారు.

Taxpayers Alert: డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులు మోసాల బారిన పడుతున్నారు. అయితే పలు రకాల స్కామ్స్ గురించి జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. మీ వ్యక్తిగత వవరాలను మ్యాన్యువల్ వెరిఫికేషన్ చేయాలని ఆదాయపు పన్ను శాక నుంచి ఏదైనా ఈ మెయిల్ వస్తే అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే ఆ మెయిల్స్ నకిలీవి, ఫిషింగ్ స్కామ్స్ లో భాగంగా వచ్చినవి అని హెచ్చరించింది.
ఫిషింగ్ అనేది మోసగాళ్లు ఆదాయపు పన్ను శాఖ వంటి విశ్వసనీయ సంస్థలను అనుకరిస్తూ , మీ బ్యాంకు వివరాలు, పాస్ వర్ట్ లు లేదా క్రెడిట్ కార్డ్ నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేస్తారు. వారు ఎక్కువగా వినియోగించే ఈ మెయిల్స్ లేదా వెబ్ సైట్ ల మాదిరిగా ఉండే వాటిని ఉయోగిస్తారు. కానీ అవి నకిలీవిగా ఉంటాయి.