Harsh Goenka: 9-5 జాబ్ చేయడంపై హర్ష్ గోయెంకా పోస్ట్ వైరల్
Harsh Goenka అతడి వయసు పెరిగేకొద్ది అదే పని చేస్తూ ఉంటాడు. జీతం పెరుగుతుంది తప్ప జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. చివరికి పదవీ విరమణ చేసేవరకు కూడా అతడు అదే కొనసాగిస్తాడు.

Harsh Goenka: హర్ష్ గోయెంకా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయడం జీవితాన్ని కోల్పోయినట్లేనని పోస్ట్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగిని తన జీవితం మొత్తాన్ని షిప్ట్ లో గడిపే తీరును వివరించే వీడియోను షేర్ చేశారు. వీడియో ఇంటర్న్ షిప్ కోసం వచ్చిన ఓ విద్యార్థికి ఓ వ్యక్తి ఉద్యోగం ఇస్తాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలబడటమే అతడి పని.
అతడి వయసు పెరిగేకొద్ది అదే పని చేస్తూ ఉంటాడు. జీతం పెరుగుతుంది తప్ప జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. చివరికి పదవీ విరమణ చేసేవరకు కూడా అతడు అదే కొనసాగిస్తాడు. వీడియో చివరలో జాబ్ మీ జీవితం మొత్తాన్ని తాగేసుకుంటుంది. ఇంకా ఆలస్యం కాకముందే ఒకే విధంగా ఉండకుండా మార్పును స్వాగతించాలని గొయెంకా సూచించారు. ఈ వీడియో పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Wake up….before it’s too late! pic.twitter.com/mlQxDWXFcw
— Harsh Goenka (@hvgoenka) July 18, 2025