Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ రాజీనామా
Gita Gopinath భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలైన గీతా, ఐఎంఎఫ్ లో తన ప్రస్థానాన్ని 2019 లో చీఫ్ ఎకనామిస్ట్ గా ప్రారంభించారు. ఆ స్థానంలో మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె, 2022 జనవరిలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు.

Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ రాజీనామా చేశారు. ఈ ఆగస్టు చివరిలో తన పదవిని వీడి, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా తిరిగి చేరనున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలైన గీతా, ఐఎంఎఫ్ లో తన ప్రస్థానాన్ని 2019 లో చీఫ్ ఎకనామిస్ట్ గా ప్రారంభించారు. ఆ స్థానంలో మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె, 2022 జనవరిలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు.
గీతా గోపినాధ్ ఐఎంఎఫ్ లో చేరినప్పటి నుంచి సంస్థకు తన అసాధారణ నైపుణ్యంతో ఎన్నో విజయాలను అందించారు. కోవిడ్ మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆమె నాయకత్తం దిశానిర్దేశం చేసింది. ఐఎంఎఫ్ లో ఆర్థిక, ద్రవ్య విధానాలు, రుణాలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి కీలక రంగాల్లో విశ్లేషణాత్మక పనులను పర్యవేక్షించారు.
Related News