Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ జోరు.. రోజుకు ఎన్ని బైక్స్ అమ్ముడుపోతున్నాయో తెలుసా ?
Royal Enfield రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా జనవరి-మార్చి 2025 (అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం) అమ్మకాల డేటాను రిలీజ్ చేసింది. కంపెనీ అమ్మకాల్లో ఏకంగా 23.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ త్రైమాసికంలో అంటే దాదాపు 90 రోజుల కాలంలో కంపెనీ మొత్తం 2,80,801 యూనిట్లను అమ్మేసింది.

Royal Enfield: మనదేశంలో మోస్ట్ పాపులర్ బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని గురించి ఎక్కడ చర్చ జరిగినా దీని ఫ్యాన్స్ దానిని పొగడకుండా ఉండలేరు. ఇది వచ్చే సౌండ్ దూరం నుంచే వినిపిస్తుంది. దీని ఇంజన్ గర్జింపు దీన్ని మిగతా బైక్‌ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ బ్రాండ్‌కున్న పవర్ ఏంటంటే.. ఇది ప్రతి రోజు వేలల్లో యూనిట్లు అమ్ముడుపోయింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా జనవరి-మార్చి 2025 (అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం) అమ్మకాల డేటాను రిలీజ్ చేసింది. కంపెనీ అమ్మకాల్లో ఏకంగా 23.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ త్రైమాసికంలో అంటే దాదాపు 90 రోజుల కాలంలో కంపెనీ మొత్తం 2,80,801 యూనిట్లను అమ్మేసింది. అంటే కంపెనీ రోజువారీ అమ్మకాలు 3,120 యూనిట్లకు పైగా ఉన్నాయి. ఇది నిజంగా చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి.
ఈ భారీ అమ్మకాలతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బాగా లాభం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొదటిసారిగా 10 లక్షల అమ్మకాల మార్క్‌ను దాటేసింది. కంపెనీ అమ్మకాలు 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10 శాతం పెరిగి 10,02,893 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ అమ్మకాల డేటాలో మరో మంచి విషయం ఏంటంటే.. కంపెనీ దేశీయ అమ్మకాలు 8.1 శాతం పెరిగి 9,02,757 యూనిట్లుగా ఉన్నాయి. అదే సమయంలో దీని ఎగుమతులు ఏకంగా 29.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ 1,00,136 యూనిట్లను ఎగుమతి చేసింది.
6 కొత్త బైక్‌లు లాంచ్
2024-25 ఆర్థిక సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు కేవలం అమ్మకాల పరంగానే కాకుండా, కొత్త బైక్‌ల పరంగా కూడా చాలా మంచిగా ఉంది. ఈ కాలంలో కంపెనీ మార్కెట్‌లో 6 కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. ఇందులో గెరిల్లా 450, బేర్ 650, క్లాసిక్ 650 వంటి బైక్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీని కూడా పరిచయం చేసింది. ఇది 2026 నాటికి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్. అయితే 90వ దశకంలో ట్రక్కులు, ట్రాక్టర్లు తయారు చేసే ఐషర్ మోటార్స్ దీన్ని కొనుగోలు చేసింది. నేడు ఇది పూర్తిగా ఒక భారతీయ కంపెనీ. దీనికి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.