Warangal: కూల్ డ్రింక్ లో గడ్డిమందు కలిపి లిక్కర్ తాగించి భర్తను లేపేసిన భార్య
Warangal కూల్‌డ్రింక్‌లో ముందుగానే గడ్డి మందు కలిపినట్లు తెలుస్తోంది. భార్య మాట నమ్మి ఆ పానీయం సేవించిన బాలాజీకి కాసేపటికే గొంతులో మంట రావడంతో కేకలు వేశాడు.

Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో జరిగిన ఒక దారుణ ఘటన కలకలం రేపింది. భార్య కాంతి తన భర్త బాలాజీని విషమిచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాంతి తన భర్త బాలాజీకి కూల్‌డ్రింక్ కలిపిన మద్యం తాగమని ఇచ్చింది. అయితే, ఆ కూల్‌డ్రింక్‌లో ముందుగానే గడ్డి మందు కలిపినట్లు తెలుస్తోంది. భార్య మాట నమ్మి ఆ పానీయం సేవించిన బాలాజీకి కాసేపటికే గొంతులో మంట రావడంతో కేకలు వేశాడు.
భర్త చనిపోతాడని భావించిన కాంతి, వెంటనే తన బావ దశరు ఇంటికి వెళ్లిపోయింది. బాలాజీ కేకలు విని చుట్టుపక్కల వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ నిన్న మృతి చెందాడు.
మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు, వర్ధన్నపేట పోలీసులు భార్య కాంతి మరియు ఆమె బావ దశరుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కాంతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.