Car Accident In Shambhipur: ఇంటి గోడెక్కిన కారు.. వీడియో వైరల్
Car Accident In Shambhipur గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడింది.

Car Accident In Shambhipur: డివైడర్ ను ఢీకొట్టి ఇంటి గోడపై పడిన కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంటి గోడపై పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుుల గాయపడ్డారు. శుక్రవారం ఉదయం గోడపై ఉన్న కారును చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందికి దించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.
నిద్రమత్తులో ఇంటిగోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి
మేడ్చల్ – దుండిగల్ పియస్ పరిదలోని శంభీపూర్‌లో కారు బీభత్సం
కారును క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/PZUcNw0KW7
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025
Related News