Gandikota Student Case: గండికోట విద్యార్థి హత్య కేసులో వీడని మిస్టరీ
Gandikota Student Case ఉదయం 8 గంటలకు తన ప్రియుడు లోకేశ్ తో బైక్ పై గండికోటకు బయలుదేరింది.

Gandikota Student Case: గండికోట ఇంటర్ విద్యార్థి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం రాత్రి విద్యార్థి సోదరుడు సురేంద్ర, మరో వ్యక్తి కొండన్నను పోలీసులు విచారించి పంపించారు. సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని బాగా హింసించి చంపారని నిర్ధారించారు. ప్రొద్దుటూరలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపించింది.
ఉదయం 8 గంటలకు తన ప్రియుడు లోకేశ్ తో బైక్ పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోట్ గేట్ కు చేరుకున్నట్లు ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటలు పాటు తిరిగి 10.47 నిమిషాలకు బైక్ పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా హత్య లేక పరువు హత్య అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.