Vikarabad: భర్తను హతమార్చిన భార్య.. తండ్రే దారుణానికి స్కెచ్
Vikarabad అదే గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ ను అతని భార్య జయశ్రీ తన తండ్రి పండరితో కలిసి హత్యచేసింది.

Vikarabad: వికారాబాద్ జిల్లాలో భర్తను హతమార్చిన భార్య. తండ్రితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ ను అతని భార్య జయశ్రీ తన తండ్రి పండరితో కలిసి హత్యచేసింది. జయశ్రీ ప్రవర్తన సరిగా లేకపోవడంతో వెంకటేశ్ పలుమార్లు ఆమెను మందలించినట్లు తెలుస్తోంది.
దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న జయశ్రీ.. తన తండ్రి పండరితో కలిసి హత్య చేసింది. ఇంట్లోనే వెంకటేష్ గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై కరన్ కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News