AP EAPCET Counseling: ఏపీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్.. ముఖ్యమైన తేదీలు ఇవే
AP EAPCET Counseling రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జూలై 27 నుంచి మొదలవుతుండగా జూలై 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతుంది.

AP EAPCET Counseling: ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈఏపీసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి మొదలు కానుందని ఏపీ ఉన్నత విద్యామండలి అధికారిక ప్రకటన చేసింది. జూలై 27న మొదలుకానున్న తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 30వ తేదీతో ముగియనుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జూలై 27 నుంచి మొదలవుతుండగా జూలై 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జూలై 28 నుంచి 31 వరకు వెబ్ అప్షన్ కు అనుమతి ఇస్తారు. ఆగస్టు 1న వెబ్ అప్షన్లు మార్పు, ఆగస్టు 4న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు సాధించిన విదార్థులు ఆగస్టు 4వ తేదీ నుంచి 8 వరకు తమకు కేటాయించిన కాలేజిల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
Related News