Bank Loan For School Fees: స్కూల్ ఫీజు కోసం బ్యాంక్ లోన్.. ఈఎంఐ కట్టలేక తల్లిదండ్రుల ఇబ్బందులు
Bank Loan For School Fees ఇంతకు పిల్లాడు స్కూల్ కు వెళ్తున్నాడంటే ఎలా చదువుతున్నాడు మీవోడు అని అడిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చదువు సంగతి దేవుడెరుగు

Bank Loan For School Fees: కొంతమంది మధ్యతరగతి వాళ్లు ఏకంగా పిల్లల ఎల్కేజీ ఫీజు కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. వాటికి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం వినేందుకు విచిత్రంగా ఉన్నా.. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసిందనే అంశాన్ని గమనించాలి. స్కూల్ ఫీజు కట్టేందుకు లోన్లు తీసుకోవడం, వాటికి ఈఏఎంలు కట్టే పరిస్థితి వచ్చేసిందంటే భవిష్యత్తు మరింత డేంజర్ గా మారే సూచనలు ఉన్నాయి. పైగా ఈ విషయం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇంతకు పిల్లాడు స్కూల్ కు వెళ్తున్నాడంటే ఎలా చదువుతున్నాడు మీవోడు అని అడిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చదువు సంగతి దేవుడెరుగు.. స్కూల్ కు వెళ్లే పిల్లాడి తల్లిదండ్రులను ఎవరైనా ముందు అడిగే ప్రశ్న.. ఫీజు ఎంత అని అడుగుతున్నారు. ఆస్పత్రి ఖర్చులకు.. కానీ ఇప్పుడు పిల్లలను స్కూల్ లో చేర్పించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.