TG Intermediate: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు… దరఖాస్తులకు మరికొన్ని రోజులే గడువు
TG Intermediate కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా ఎంపికలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా బోర్డు గడువు పొడిగించింది.

TG Intermediate: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులకు మరికొన్ని రోజులే గడువు ఉంది. ఇప్పటికే మొదటి విడత ఆడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ప్రవేశాల గడువు ఆగస్టు 20 వరకు పెంచినట్లు బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లి గడువును పెంచే అవకాశం లేదని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా ఎంపికలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా బోర్డు గడువు పొడిగించింది.
ఈ నిర్ణయాన్ని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్, ఇతర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆగస్టు 20లోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలో మాత్రమే ప్రవేశం తీసుకోవాలని బోర్డు సూచించింది. గుర్తింపు లేని సంస్థలలో అడ్మిషన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.