IB ACIO Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అప్లై చేసుకొండి..
IB ACIO Recruitment 2025 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆగస్టు 12 చివరి తేదీ. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్ సైట్ ద్వారా అప్లౌ చేసుకోవచ్చు.

IB ACIO Recruitment 2025: హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో మొత్తం 3717 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుంచి మొదలవగా ఆగస్టు 10 వరకు కొనసాగనుంది.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆగస్టు 12 చివరి తేదీ. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్ సైట్ ద్వారా అప్లౌ చేసుకోవచ్చు. దరఖాస్తుదారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు గరిష్ట వయసు 27 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరి వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ 44, 900 నుంచి 1, 42,400 జీతం ఇస్తారు.
Related News