SSC New Rules: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూ రూల్స్
SSC New Rules పరీక్ష సమయంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు లైవ్ ఫోటో గ్రఫీ అమలు చేయనున్నారు. ఈ క్రమంలో పరీక్ష హాలులోకి ప్రవేశించే సమయంలో, పరీక్ష సమయం, ముగింపు టైంలో కూడా అభ్యర్థుల ఫొటో తీయబడుతుంది.

SSC New Rules: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూ రూల్స్ గురించి కీలక అప్ డెట్ ఇచ్చింది. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి గురించి కీలక అప్ డెట్ ఇచ్చింది. రాబోయే పరీక్షల కోసం స్టాప్ సెలక్షన్ కమిషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం అభ్యర్థుల ప్రత్యేక్ష ఫోటో గ్రఫీ, కఠినమైన భద్రతా తనిఖీలు, పరీక్ష సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి వంటి కఠినమైన ఏర్పాట్లు అమల్లోకి తెచ్చింది.
పరీక్ష సమయంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు లైవ్ ఫోటో గ్రఫీ అమలు చేయనున్నారు. ఈ క్రమంలో పరీక్ష హాలులోకి ప్రవేశించే సమయంలో, పరీక్ష సమయం, ముగింపు టైంలో కూడా అభ్యర్థుల ఫొటో తీయబడుతుంది. పరీక్ష కేంద్రాల్లో వీడియో నిఘా, తనిఖీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒక రకమైన అనుచిత ప్రవర్తన లేదా మోసం వల్ల పరీక్షను వెంటనే రద్దు చేస్తారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ గడియారాలు, పుస్తకాలు, పెన్నులు, ఎలక్ట్రానికి గాడ్జెట్ లు మొదలైనవి పరీక్షా కేంద్రంలో పూర్తిగా నిషేధించబడతాయి.