Arjun Tendulkar Engagement: అర్జున్ టెండ్యూల్కర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా?
Arjun Tendulkar Engagement సన్నిహితులు మాత్రమే హాజరయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు టెండూల్కర్ కుటుంబం, ఘాయ్ కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండ్యూల్కర్ నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ వనవరాలు సానియా చందోక్ తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అర్జున్, సానియా ఎంగేమెంట్ కు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు టెండూల్కర్ కుటుంబం, ఘాయ్ కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు సమక్షంలో అర్జున్, సానియా చందోక్ ఉంగరాలు మార్చుకున్నట్లు ఓ పత్రిక రాసుకొచ్చింది. అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 17 మ్యాచ్ ల్లో 532 పరుగులు, 1 సెంచరీ, 2 హాఫ్ చెంచరీలు, 37 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్జున్ 73 బంతులు వేసి మూడు వికెట్లు తీశాడు. బౌలింగ్ అత్యుత్తమ గణాంకం 1/9 గా నమోదు చేశాడు.