Avatar 3 Trailer: అవతార్ 3 ట్రైలర్ .. ఈసారి అంతకు మించి
Avatar 3 Trailer పాండోరా మళ్లీ ఎదుర్కొంటున్నా మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలు అద్భుతంగా చూపించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.

Avatar 3 Trailer: అవతార్ 3 ట్రైలర్ ట్రైలర్ విడుదలైంది. మొదటి భాగంలో పండోరా గ్రహం అడవుల్లో నివసించే జాతి, రెండో భాగంలో నీటిలో ఉండే వారి అధారంగా సినిమాలు తెరకెక్కయి. మూడో భాగంలో ఫైర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ ట్రైలర్ లో కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్లీ ఎదుర్కొంటున్నా మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలు అద్భుతంగా చూపించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై ఇచ్చేలా ఉంది. మొదటి రెండు భాగాలను మించి హై విజువల్స్, ఎమోషన్స్ తో సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడూ అని అనిపించేలా ఉంది. కామెరున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రాఫిక్స్ అంటే కామెరున్ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు. డిసెంబర్ 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రానుంది. 160 భాషల్లో అనువాదం అయి రిలీజ్ కానుంది.