Dil Ruba: ఈ పదాల విలువ తెలియాలనే.. దిల్ రూబా సినిమా స్టోరీ చెప్పేసిన కిరణ్
Dil Ruba:
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నాడు. ఇటీవల కా సినిమా హిట్ కొట్టి.. ఇప్పుడు దిల్ రూబా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్‌ను ఇటీవల మూవీ టీం విడుదల చేసింది. ఇవి ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ట్రైలర్ కాస్త డిఫరెంట్ ఉందని, మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2గంటల 20నిమిషాలు ఉండే ఈ సినిమా బాగుంటుందని, ఎక్కడ సినిమాలో బోర్ కొట్టదని, అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని కిరణ్ అబ్బవరం ఇటీవల తెలిపాడు. అయిత మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం ఇటీవల సుమ పాడ్ కాస్ట్‌కి వెళ్లాడు. ఈ ఇంటర్వ్యూలో సుమ కొన్ని ప్రశ్నలు వేసింది. సినిమాలు గురించి, వ్యక్తిగతం గురించి కూడా అడిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ కిరణ్‌ను సినిమా కాన్సెప్ట్ ఏంటని అడిగింది. దీనికి కిరణ్ అబ్బవరం సినిమా స్టోరీని చెప్పాడు. ప్రతీ ఒక్కరూ కూడా లైఫ్‌లో సారీ, థ్యాంక్స్ పదాలను ఎక్కువగా వినియోగిస్తారు. కానీ వాటిని ఎక్కడ వినియోగించాలో తెలియదు. నిజానికి వాటికి ఉన్న వాల్యూ కూడా కొందరికి తెలియదని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దిల్ రూబా సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ అయిన యూడ్లీ ఫిలిం కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హోలీ సందర్భంగా ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ టీం భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. దీని కంటే ముందు కిరణ్ అబ్బవరం కా సినిమాతో హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాలో సమయంలో రహస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రహస్య త్వరలో బిడ్డకు కూడా జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించారు. త్వరలో పాప లేదా బాబు పుట్టనున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది.



