Jatadhara: జటాధరలో సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ రిలీజ్.. అదిరిపోయిందిగా!

Jatadhara:
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, వెంకట్ కల్యాణ్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం జటాధర. మైథలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలిసింది. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మూవీ టీం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ఫొటోను రిలీజ్ చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. ఈ మహిళా దినోత్సవం జటాధారలో బలం, శక్తి దీప స్తంభం ఉదయిస్తుందని.. సోనాక్షి సిన్హాకు స్వాగతమంటూ సోషల్ మీడియా వేదికగా లుక్‌ను బయట పెట్టారు. అయితే ఆమె ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది.
Sonakshi Sinha is making her grand Telugu debut with Jatadhara! Her first look screams power, and fans are loving it! Are you ready for this fierce new avatar? 🔥 #SonakshiSinha #Jatadhara #InternationalWomensDay #WomensDay2025 #Tollywood #EntertainmentNews pic.twitter.com/hAtVFButmo
— Masala! (@masalauae) March 8, 2025
పవర్ ఫుల్ రోల్‌లో సోనాక్షి ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నల్లని కళ్లతో జుట్టు విరబూసుకొని భయపెట్టేలా సోనాక్షి లుక్ ఉంది. ఫస్ట్ లుక్ ఇలా ఉంటే సినిమాలో సోనాక్షి పాత్ర ఎలా ఉంటుందో అని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తు్న్నారు. జీ స్టూడియో సమర్పణలో వస్తున్న ఈ సినిమాని కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కథతో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు.
యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫాదర్ సెంటిమేట్‌తో వచ్చింది. ఎమోషనల్‌గా ప్రేక్షకులను సుధీర బాబు కట్టి పడేశాడు. లవ్ మూవీస్, యాక్షన్ సినిమాల్లో నటించిన సుధీర్ బాబు మొదటిసారి డిఫరెంట్‌గా మైథలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో నటిస్తున్నాడు. జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే సుధీర్ బాబు సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమా. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేయబోతుందో చూడాలి.