Yemen Boat Capsized: పడవ బోల్తా పడి 68 మంది మృతి
Yemen Boat Capsized మిగిలిన అందరూ నీటిలో మునిగిపోయారు. 54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి.

Yemen Boat Capsized: పడవ బోల్తా పడి 68 మంది మృతి మరణించారు. ఈ ఘటన యెమెన్ లో చోటుచేసుకుంది. మరో 74 మంది గల్లంతు అయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళుతున్న బోటు యెమెన్ అభ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. దీంతో 154 మంది నీటిపై పడిపోయారు. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన అందరూ నీటిలో మునిగిపోయారు. 54 మంది శవాలు ఖాన్ఫర్ జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి.
మరికొన్ని శవాలు వేరే ప్రాతంలో కనిపించాయి. ఆ శవాలను మార్చురీకి తరలించారు. మిగిలిన 74 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన వలసదారులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు పనుల కోసం పోతుంటారు, స్మగ్లర్లు వారిని పడవల ద్వారా రెడ్ సీ, గల్ప్ ఆఫ్ ఏడెన్ ల మీదుగా అరబ్ దేశాలకు తరలిస్తూ ఉంటారు.