Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. తప్పుడు మృతదేహాలిచ్చారు.. బ్రిటన్ ఆరోపణ
Air India Crash ఈ ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వీరు మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోగా 34 మంది చనిపోయారు.

Air India Crash: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులకు సంబంధించి తప్పుడు మృతదేహాలు చేరాయని బ్రిటన్ కు చెందిన రెండు కుటుంబాలు తెలిపాయి. తమవారి మృతదేహాలను సరిగా గుర్తించలేదని ఆరోపించారు. బాదిత కుటుంబాల డీఎన్ఏతో ఆ రెండు మృతదేహాల డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని బ్రిటన్ కుటుంబాల తరఫు న్యాయవాది జేమ్స్ హీలీ తెలిపారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే ఓ నివాస ప్రాంతంలో కూలిపోయింది.
ఈ ఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వీరు మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోగా 34 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలు పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. దీంతో వాటిని గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు.
Related News