Pomegranate Seeds: దానిమ్మ గింజలను ఫ్రిజ్ లో నిల్వ చేయవచ్చా?
Pomegranate Seeds దానిమ్మ రుచి, పోషకాలు పోతాయని అంటున్నారు. అయితే దానిమ్మ గింజలను ఫ్రిజ్ లో నిల్వ చేయాలనుకుంటే ముందుగా వాటిని గాలి చొరబడని కంటైనర్ లో నింపిండి.

Pomegranate Seeds: దానిమ్మ పండు రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే చాలా మంది దానిమ్మ విత్తనాలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. కానీ దానిమ్మ గింజలను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా అని తెలుసుకుందాం. చాలా మంది దానిమ్మ గింజలను ఒక ప్లేట్ లో ఉంచి ఫ్రిజ్ లో ఉంచుతారు. అయితే అలా చేయడం మంచిది కాదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల దానిమ్మ రుచి, పోషకాలు పోతాయని అంటున్నారు. అయితే దానిమ్మ గింజలను ఫ్రిజ్ లో నిల్వ చేయాలనుకుంటే ముందుగా వాటిని గాలి చొరబడని కంటైనర్ లో నింపిండి.
ఈ కంటైనర్ కు సరిగ్గా మూసి ఫ్రిజ్ లో ఉంచండి. ఈ విధంగా దానిమ్మ గింజలు 2 నుంచి 3 రోజులు తాజాగా ఉంటాయి. ప్రతిసారి వాటిని ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత తేమ లోపలికి రాకుండా వెంటనే మూసివేయాలి. అలాగే దానిమ్మ గింజలను ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే దానిలో ఉండే తేమ వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.