Furniture Care Tips: వర్షాకాలంలో ఫర్నీచర్ పాడవకుండా ఇలా చేయండి
Furniture Care Tips వర్షాకాలంలో చెదపురుగుల బెడద పెరుగుతుంది. కాబట్టి ముందే పెస్ట్ కంట్రోలో చేయించుకోవాలి.

Furniture Care Tips: ప్రతి ఇంట్లో ఫర్నిచర్ ను ఉపయోగిస్తారు. సాధారణంగా ఇళ్లలో చెక్కతో కూడిన ఫర్నీచర్ ఉండడం వల్ల వర్షంలో పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు ఇతర చెక్క వస్తువులతో కూడా సమస్యలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిల్లో ఫర్నిచర్ ను నీరు చేరకోలేని ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. కిటికీలు, తలుపులు లేదా వర్షాల సమయంలో నీటి లీకేజీ ఉన్న ప్రదేశాల దగ్గర ఫర్నిచర్ ఉంచడం మానుకోండి.
వర్షాకాలంలో చెదపురుగుల బెడద పెరుగుతుంది. కాబట్టి ముందే పెస్ట్ కంట్రోలో చేయించుకోవాలి. ఫర్నిచర్ ను శుభ్రం చేసి, అవసరమైతే మరమ్మతులూ చేసుకోవాలి. వర్షంలో తడిసిన ఫర్నిచర్ ను ఎండలో అరబెట్టకూడదు. ఎండలో నేరుగా ఉంచితే చెక్కలు మరింత దెబ్బతింటాయి. అందుకే నీడలో అరబెట్టడమే మంచిది. ఇక వారానికి రెండు మూడు సార్లు తుడవాలి.
Related News