Money: వీళ్లకు డబ్బు అప్పుగా ఇచ్చారు.. అంతే సంగతి..
Money కొందరికి అక్కరకు రాని వాళ్లకు డబ్బు అప్పగా ఇస్తే కచ్చితంగా నష్టపోతారు. డబ్బు చేతిలో లేనిదే రోజు గడవడం అసాధ్యం. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి మన జీవితాన్ని నడిపించేది డబ్బే. డబ్బు మనిషికి ఆరో ప్రాణంగా మారింది.

Money: మానవుని అవసరాలకూ కోర్కెలకూ అంతూపొంతూ ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా కావాలనే ఆశ ఉంటుంది. కొందరేమో ఎంత చాకిరీ చేసిన పేదరికం నుంచి బయటపడరు. పేదవాడు, ఆస్తిపరుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే మనకు తెలిసిన చాలామంది స్నేహితులు, బంధువులు ఏదొక సందర్భంలో అప్పులు అడుగుతారు. పరిచస్థులకూ కొన్నిసార్లు డబ్బులు ఇస్తుంటాం.
కానీ కొందరికి అక్కరకు రాని వాళ్లకు డబ్బు అప్పగా ఇస్తే కచ్చితంగా నష్టపోతారు. డబ్బు చేతిలో లేనిదే రోజు గడవడం అసాధ్యం. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి మన జీవితాన్ని నడిపించేది డబ్బే. డబ్బు మనిషికి ఆరో ప్రాణంగా మారింది. అనవసరంగా అడిగారు కదా అని ఇలాంటి వారికి ఇస్తే మీ డబ్బులు వదులుకోవల్సిందే.
కొంత మంది అప్పు తీసుకున్న తర్వాత దానిని తిరిగి చెల్లించడం మర్చిపోతారు. దీంతో తాము డబ్బు తీసుకున్న సంగతి మర్చిపోయి. దానిని ఎప్పటికీ తిరిగి ఇవ్వరు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పదే పదే అప్పు అడిగితే వారికి డబ్బు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి.