Self Respect: ఎవరి కోసం కూడా వీటిని అసలు మార్చుకోవద్దు..

Self Respect: సంతోషం గురించి మాట్లాడే ముందు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం ముఖ్యమా లేక ప్రపంచాన్ని సంతోషంగా ఉంచడం ముఖ్యమా అనేది మీరు ముందు డిసైడ్ అయ్యారా? ఎందుకంటే మీరు ఇతరుల అంచనాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు (సెల్ఫ్ ఐడెంటిటీ) మార్చుకుంటూ ఉంటే, ఒక రోజు మీరు అద్దంలో నిలబడి మీ స్వంత కళ్ళలోకి (సెల్ఫ్ రెస్పెక్ట్) చూసుకోవడానికి కూడా వెనుకాడతారు. కాబట్టి, ఎవరు ఏమి చెప్పినా, కొన్ని అలవాట్లను మాత్రం అసలు మార్చుకోవద్దు అంటున్నారు నిపుణులు.
మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. కానీ ఇలా చేస్తే మిమ్మల్ని సెల్పిష్ అంటారు. బట్ అది స్వార్థం కాదు, స్వీయ ప్రేమ. మీరు మీ ఆనందాన్ని, అవసరాలను విస్మరిస్తే, మీలో మీరు ఉండరు. ఇతరులకు సహాయం చేయండి. కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం ముఖ్యం. మీ కలలను, ఆశయాలను వదులుకోకండి
ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్? అందులో ఏం సంపాదిస్తావ్. వేస్ట్ వంటి మాటలు వినే ఉంటారు. అయితే మీరు మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకుంటున్నారా? మీకు ఇష్టానుసారంగనా? ఈ విషయం మీకు క్లారిటీ ఉండాలి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేకుంటే తర్వాత మీరు పశ్చాత్తాపపడతారు.
‘వద్దు’ అని చెప్పడం నేర్చుకోండి
మీరు వారి మాట వినాలని, వారి కోసం సమయం కేటాయించాలని కొందరు కోరుకుంటారు. వారి కోరికల ప్రకారం ప్రవర్తించాలని అనుకుంటారు. కానీ వారు మీ విషయంలో కూడా అదే చేస్తారా? మరి లేదంటే ‘వద్దు’ అని చెప్పడానికి ఎందుకు సంకోచం? ప్రతిదానికీ ‘అవును’ అని చెప్పనవసరం లేదు. మీ పరిమితులను నిర్ణయించుకోండి.
మీ నైతిక విలువలపై రాజీ పడకండి.
కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి లేదా తప్పు పనులు చేయడానికి బలవంతం చేయవచ్చు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేస్తే మాత్రం తర్వాత మీకే సిగ్గు అనిపిస్తుంది. మనసులో బాధ పడుతుంటారు. సో జాగ్రత్త. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సరైన దాని కోసం నిలబడాలి. ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు.
ఏదైనా సంబంధం లేదా ఎవరైనా వ్యక్తి మీ మానసిక ప్రశాంతతను ఇబ్బంది పెడుతుంటే ఆ విషయానికి వారికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వారి గురించి పెద్దగా చింతించవద్దు. అంతా బాగానే ఉంటుందని ఎవరు అయినా చెబతారు. నిజంగా మీరు సంతోషంగా లేకుండా వారి మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఉపయోగం ఏంటి? ప్రతికూల విషయాల నుంచి వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి!
వ్యక్తిగత స్థలంలో రాజీ పడకండి
ప్రతి వ్యక్తికి తన గోప్యత, ఒంటరిగా సమయం గడపడానికి హక్కు ఉంది. ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే, మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే, అది సరైనది కాదు అని గుర్తు పెట్టుకోండి. సో వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి.
దయ గుణం: మీ మంచి తనం వల్ల ఇతరులు సంతోషపడతారు. వారికి ఉపయోగం నీకేంటి ఉపయోగం అంటూ సెల్ఫిష్ గా మాట్లాడతారు. బట్ మీకు ఏది ఇష్టమో అదే చేయండి. ఎందుకంటే మీరు వారిలా మారాలా? మీరు ఇతరుల పట్ల వినయంగా, దయగా, నిజాయితీగా ఉంటే మీరు చాలా మంచివారు. ఎవరు గుర్తించుకున్నా కాలం గుర్తిస్తుంది. ప్రపంచం ఎలా ఉన్నా, మీరు మీ మంచితనాన్ని కాపాడుకోవాలి. ప్రపంచం మారవచ్చు, కానీ మీ మానవత్వాన్ని వదులుకోకండి.