Skin Care Tips: వచ్చింది ఎండాకాలం. జర భద్రం మీ స్కిన్..

Skin Care Tips:
వేసవి ప్రారంభమవుతోంది. వేడి పెరిగేకొద్దీ, అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా వాటి ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాయి. మండే ఎండ, తేమ, చెమట చర్మాన్ని నిర్జీవంగా మార్చడమే కాకుండా, టానింగ్, మొటిమలు, నీరసం వంటి సమస్యలను కూడా పెంచుతాయి. శీతాకాలం ముగిసిన తర్వాత, ఉష్ణోగ్రత వేగంగా పెరిగినప్పుడు, మన చర్మానికి అదనపు జాగ్రత్త అవసరం. ఇది ముఖ సహజ కాంతిని కాపాడుతుంది.
వేసవిలో మండే ఎండల కారణంగా, వడదెబ్బ, అకాల ముడతలు (Summer glowing skin tips) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పటి నుంచి మన చర్మ సంరక్షణ దినచర్యను మార్చుకోవడం చాలా ముఖ్యం. వేడికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోని మీ స్కిన్ ను ఎలా రక్షించుకోవాలో కూడా కాస్త జాగ్రత్త పడాల్సిందే. సరైన చర్మ సంరక్షణ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సూర్యకాంతి, చెమట వల్ల కలిగే సమస్యలను కూడా నివారించవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా స్కిన్ కు కేర్ తీసుకోవాలో చూసేద్దాం.
నీరు పుష్కలంగా: వేసవిలో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే , వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. దీనితో, మీరు చర్మపు చికాకు, మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కనీసం 4 లీటర్ల నీరు క్రమం తప్పకుండా నీరు తీసుకోవాలి. మీరు నాలుగు లీటర్ల నీరు తాగితే, మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా, మీ బరువు కూడా తగ్గుతుంది.
తేనె – రోజ్ వాటర్:
ఒక గిన్నెలో ఒక టీస్పూన్ తేనె తీసుకోండి. దానికి రోజ్ వాటర్ కలపండి. రెండు వస్తువులను బాగా కలపి. ఇప్పుడు దానిని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత, మీ ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
దోసకాయ రసం: వేసవిలో మార్కెట్లో దోసకాయలు పుష్కలంగా లభిస్తాయి. దోసకాయను సలాడ్‌గా విస్తృతంగా ఉపయోగిస్తారు. దోసకాయ ఆరోగ్యానికి మంచిదని మాత్రమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. మీకు కావాలంటే, మీరు దోసకాయ జ్యూస్ కూడా తాగవచ్చు. లేదా రాత్రి పడుకునేటప్పుడు కూడా మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు . ఎలా చేసినా సరే మంచి ప్రయోజనాలు అందుతాయి.
చర్మాన్ని తేమగా ఉంచుతాయి: సీజన్ ఏదైనా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యం. వేసవిలో కూడా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. స్నానం చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా మీ ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.