Western Toilet : వెస్ట్రన్ టాయిలెట్ పక్కన ఉండే చిన్న షవర్ కథ తెలుసా మీకు?
Western Toilet : వెస్ట్రన్ టాయిలెట్ పక్కన ఏర్పాటు చేసిన చిన్న షవర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇది భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దాని అసలు పేరు తెలుసు. అయితే దీన్ని జెట్ స్ప్రే అని అంటారు. మరి దీన్ని ఎందుకు ఇలా పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Western Toilet : మన దైనందిన జీవితంలో సరైన పేరు తెలియని అనేక వస్తువులను మనం ఉపయోగిస్తాము. కొన్నిసార్లు పేరు తెలియక తప్పు పేరు కూడా వాడుతుంటారు. ఎవరూ దాని అసలు పేరు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఇక వెస్ట్రన్ టాయిలెట్ పక్కన ఏర్పాటు చేసిన చిన్న షవర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇది భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దాని అసలు పేరు తెలుసు. అయితే దీన్ని జెట్ స్ప్రే అని అంటారు. మరి దీన్ని ఎందుకు ఇలా పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం సాధారణంగా జెట్ స్ప్రే అని పిలిచే దాని అసలు పేరు ‘హెల్త్ ఫాసెట్’ లేదా ‘బిడెట్ షవర్’. ఇది వెస్ట్రన్ టాయిలెట్ పక్కన ఏర్పాటు చేసే ఒక చిన్న చేతితో పట్టుకునే షవర్. దాని సహాయంతో, శుభ్రపరచడం సులభం. మరింత సౌకర్యవంతంగా మారుతుంది. టాయిలెట్ పేపర్ కంటే నీటితో శుభ్రపరచడం మరింత పరిశుభ్రమైనదని, మంచిదని భావించే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో బిడెట్ షవర్లు అంత సాధారణం కాదు. కానీ భారతదేశం, జపాన్, ఇతర ఆసియా దేశాలలో వాటి వాడకం పెరుగుతోంది.
జెట్ స్ప్రేలు సాధారణంగా చాలా వేగంగా నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. దీంతో కొంతమందికి వాడటం అసౌకర్యంగా ఉంటుంది. మరోవైపు, బిడెట్ షవర్ ఒత్తిడిని సర్దుబాటు చేయవచ్చు. శుభ్రపరచడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇక పాశ్చాత్య దేశాలలో, చాలా మంది టాయిలెట్ పేపర్‌ను ఉపయోగిస్తారు. కానీ భారతదేశం, ఇతర ఆసియా దేశాలలో, నీటితో శుభ్రం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మంచి పరిశుభ్రత
టాయిలెట్ పేపర్‌తో శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా, మురికి పూర్తిగా తొలగిపోదు. కానీ నీటితో శుభ్రం చేయడం వల్ల మెరుగైన పరిశుభ్రత ఉంటుంది. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా నీటితో శుభ్రం చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
పర్యావరణానికి మేలు చేస్తుంది
టాయిలెట్ పేపర్ తయారీ కోసం ప్రతి సంవత్సరం లక్షలాది చెట్లను నరికివేస్తారని మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం, టాయిలెట్ పేపర్ తయారీ కోసమే ఒక సంవత్సరంలో దాదాపు 27,000 చెట్లను నరికివేస్తారు. అందుకే ఈ రెండింటిని పోలిస్తే, నీటితో శుభ్రపరచడం వల్ల పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది. టాయిలెట్ పేపర్‌ను మళ్లీ మళ్లీ కొనవలసి వస్తుంది. దీనివల్ల ప్రతి నెలా అదనపు ఖర్చు అవుతుంది. మరోవైపు, హెల్త్ ఫాసెట్ లేదా బిడెట్ షవర్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత సంవత్సరాల తరబడి ఉంటుంది. మళ్లీ మళ్లీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మనీ ఆదా చేస్తుంది. భారతదేశంలో, నీటితో క్లీన్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారతీయులు పాశ్చాత్య మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నప్పటికీ, నీటితో శుభ్రం చేసుకోవడం మంచిదని భావిస్తారు.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే