Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
Success విజయం సాధించాలంటే అర్హత కూడా ఉండాలి. ఉదాహరణకు మీరు ఐఏఎస్ కావాలని అనుకుంటారు. కానీ మీకు సాధించే అర్హత ఉండదు. వయస్సు అయిపోతే సాధించలేరు. కాబట్టి మీరు విజయం సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో పాటు అర్హత కూడా ఉండాలి.

Success: జీవితంలో ఏదైనా సాధించాలని, అందరి కంటే గొప్పగా బతకాలని చాలా మంది ఆశిస్తారు. కానీ కొన్ని సమయాల్లో వచ్చే సమస్యల వల్ల కొందరు ఆటోమెటిక్‌గా డల్ అవుతారు. ఎలాంటి వారైన జీవితంలో విజయం సాధించాలంటే మాత్రం తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ప్రతీ వ్యక్తికి కొన్ని విషయాల్లో విజయం సాధించాలనే పట్టుదల, నమ్మకం ఉండాలి. కొందరు ప్రతీ విషయానికి భయపడుతూ ఉంటారు. దీనివల్ల రావాల్సిన విజయం కూడా రాదు. దీంతో ఎన్నో సమస్యల బారిన పడటం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అయితే విజయం సాధించాలనే పట్టుదల ఉన్నవారు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. మరి ఎలాంటి రూల్స్ పాటిస్తే విజయం సాధిస్తారో ఈ స్టోరీలో చూద్దాం.
ఆత్మవిశ్వాసం
ప్రతీ వ్యక్తికి కూడా ఇతరుల కంటే తనపై తనకు నమ్మకం ఉండాలి. తనపై తనకు నమ్మకం ఉంటే ఎలాంటి కష్ట సమయాల్లో అయినా కూడా విజయం సాధిస్తారు. అసలు విజయం సాధించడానికి ఆస్కారం లేని చోట కూడా ఆత్మ విశ్వాసంతో మీరు విజయాన్ని సాధించవచ్చు. ఏ పని ప్రారంభించినా కూడా నమ్మకంతో ఉండాలి. తప్పకుండా జరుగుతాదనే నమ్మకంతో ముందుకు వెళ్తే.. విజయం తథ్యం.
అర్హత
విజయం సాధించాలంటే అర్హత కూడా ఉండాలి. ఉదాహరణకు మీరు ఐఏఎస్ కావాలని అనుకుంటారు. కానీ మీకు సాధించే అర్హత ఉండదు. వయస్సు అయిపోతే సాధించలేరు. కాబట్టి మీరు విజయం సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో పాటు అర్హత కూడా ఉండాలి.
ప్రణాళిక
విజయం సాధించాలంటే ప్రణాళిక కూడా తప్పనిసరిగా ఉండాలి. మీరు వేసుకునే ప్లాన్ సరిగ్గా ఉంటేనే మీరు విజయం సాధించే దిశ కూడా బాగుంటుంది. కొందరు విజయం సాధించాలని ఎన్నో కలలు కంటారు. కానీ వాటికి తగ్గట్లు ప్లాన్‌లు వేసుకోరు. దీనివల్ల వారి విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పనులు వాయిదా వేసేస్తారు. ఇలా వేయడం వల్ల విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. విజయం సాధించాలంటే ముందుగా ప్లాన్ సరిగ్గా వేసుకోండి.
మధ్యలో వదిలేయకూడదు
ఏదైనా పనిని ప్రారంభించామంటే సమస్యలు ఉంటాయి. ఏదో రకంగా ఆటంకాలు ఏర్పడతాయి. కొందరు వీటిని తట్టుకోలేక మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు ఎన్ని సమస్యలు వచ్చినా కూడ మధ్యలో వదిలేయకుండా ఉంటారు. అలాంటి వారినే విజయం సిద్ధిస్తుంది. ఏదో చిన్న సమస్యలు వచ్చినా కూడా మధ్యలో వదలకుండా ఉంటేనే విజయం వస్తుంది. కాబట్టి చిన్న సమస్యలను తట్టుకోలేక మధ్యలో వదిలేయవద్దు.
భయపడకూడదు
కొందరు ప్రతీ విషయానికి భయపడుతుంటారు. ప్రతీ చిన్న విషయానికి కూడా ఎక్కువగా భయపడకూడదు. ఏదైనా పనిని ప్రారంభించారంటే.. ఏం జరిగినా కూడా పర్లేదు.. అన్నింటిని కూడా ఫేస్ చేయాలి. భయపడితే ఏ పని కూడా సరిగ్గా కాదు. విజయం అనేది తర్వాత సంగతి. భయపడకుండా ఏదైనా పనిని ప్రారంభించండి. ఆటోమెటిక్‌గా విజయం సిద్ధిస్తుంది.
-
Ear Hair: చెవి వెంట్రుకల బట్టి వ్యక్తిత్వం.. ఈజీగా చెప్పేయచ్చు
-
Feel Shocked: టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?
-
Drink The Water: ఈ చెట్టు ఆకు వాటర్ తాగితే.. చిటికెలో అనారోగ్య సమస్యలన్నీ పరార్
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?