Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు పాటించి పెళ్లి చేసుకుంటారు. అందరికీ అన్ని సంప్రదాయాలు కాకుండా కొందరికి కొన్ని ఉంటాయి. కొందరు వీటిని పాటిస్తే మరికొందరు వీటిని పాటించరు. పెళ్లి అనేది జీవిత కాలంలో చేసుకునే ఒక ముఖ్యమైన ఘట్టం.

Wedding:ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు పాటించి పెళ్లి చేసుకుంటారు. అందరికీ అన్ని సంప్రదాయాలు కాకుండా కొందరికి కొన్ని ఉంటాయి. కొందరు వీటిని పాటిస్తే మరికొందరు వీటిని పాటించరు. పెళ్లి అనేది జీవిత కాలంలో చేసుకునే ఒక ముఖ్యమైన ఘట్టం. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆచారాలు సంప్రదాయాలు అన్ని కూడా పాటించి పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లి సమయంలో అమ్మాయి కంటే అబ్బాయిని ఎంతో గౌరవంగా చూస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నారు. పెళ్లి చేసి పంపిస్తున్నారని అల్లుడు తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ పెళ్లి చేస్తారు. ఈ క్రమంలో పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకున్న పెళ్లిలో కన్యాదానం చాలా ముఖ్యమైనది. అసలు కన్యాదానం లేకుండా పెళ్లి జరగదు. పెళ్లిలో అల్లుడు కాలు మామ కడగుతాడు. అసలు పెళ్లిలో అల్లుడు కాలు మామ ఎందుకు కడుగుతారు? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అంటూ హీరో విషెస్
పెళ్లి అనేది నూరేళ్లు బంధం. ఒక్కసారి పెళ్లి అయితే ఎన్ని కష్టాలు వచ్చిన ఆ బంధాన్ని వదలకూడదు. అయితే పెళ్లిలో కన్యాదానం నిర్వహించడానికి కూడా ఓ కారణం ఉంది. పెళ్లిలో అల్లుడు కాలును మామ కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారు. అయితే ఇలా అల్లుడు కాలు కడగడం వెనుక ఓ కారణం ఉందట. కూతురిని చిన్నప్పటి నుంచి ఎంతో ముద్దుగా చూసుకుంటారు. ఇలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ధర్మ, అర్ధ, కామ, మోక్షలకై నీకు అర్పిస్తున్నానని చెబుతూ పెళ్లి కొడుకును శ్రీమన్నారాయణుడిగా భావించి, కూతురుని లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్లను మామ కడుగుతారు. అలాగే పెళ్లి సమయంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ పారాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యామ్ అనే మంత్రాన్ని చదువుతారు. అయితే శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపుడిగా వరుడుని భావిస్తారు. అలాగే వధువును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే వీరిద్దరిని అందంగా అలంకరిస్తారు. అయితే శ్రీమన్నారాయణ పాదాలను గంగ తాకుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. పెళ్లిలో అల్లుడు కాళ్లను తాకినా నీళ్లు గంగలా మారుతాయి. వాటిని నెత్తిమీద చల్లుకుంటారు.
Read Also: లో బీపీ ఉన్న వాళ్లు వెంటనే ఈ పని చేయండి.. కాసేపట్లోనే ఉపశమనం
పెళ్లిలో కన్యాదానం మాత్రమే కాకుండా చాలా ఉన్నాయి. పెళ్లిలో జరిగే ప్రతీ తంతు కూడా చాలా ముఖ్యమైనది. వరుడు, వధువు జీవితాంతం కలిసి మెలసి సంతోషంగా ఉండాలని భావించి నిర్వహిస్తారు. పెళ్లిలో ఇలా నిర్వహించే ప్రతీ తంతుకు కూడా ఓ అర్థం ఉంది. చాలా మందికి వీటిని ఎందుకు నిర్వహిస్తారనే విషయం సరిగ్గా తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది సంప్రదాయాల ప్రకారం పెళ్లి నిర్వహించకుండా ఎంజాయ్ కోసం నిర్వహిస్తున్నారు.
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
-
Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
-
Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్లు వాడండి