Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే

Numerology: పుట్టిన తేదీకి, జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని న్యూమరాలజీ చెబుతుంది. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, మన భవిష్యత్తు, అదృష్టం వంటి అనేక విషయాలను తెలుసుకోవచ్చని న్యూమరాలజీ నిపుణులు నమ్ముతారు. అయితే కొందరు వ్యక్తులకు పెళ్లి తర్వాత అదృష్టం తలుపు తడితే, మరికొందరికి పెళ్లికి ముందు అదృష్టం కలుగుతుంది. నంబర్లలో కొన్ని తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటో ఆటోమెటిక్‌గా అదృష్టం కలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరి ఏయే తేదీల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఏ నెలలోనైనా 7వ తేదీన, 16వ తేదీన లేదా 25వ తేదీన పుట్టి ఉంటే వారి మూల సంఖ్య 7 అవుతుంది. ఈ సంఖ్య కేతు గ్రహానికి సంబంధించినది. వీరిలో కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిని చేపడితే, దాన్ని పూర్తి చేయడానికి అంకితభావంతో కృషి చేస్తారు. లోతుగా ఏ విషయాన్ని అయినా ఆలోచిస్తారు. అలాగే సమస్యలను వివిధ కోణాల నుంచి విశ్లేషిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితం, మరణం, విశ్వం వంటి విషయాలపై వీరు తరచుగా ఆలోచిస్తారు. వీరిక నచ్చినట్లు ఉంటారు. ఇతరులు చెప్పిన విషయాలను పట్టించుకోరు. వీరికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరికి కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వారికి తగిన గుర్తింపు లేదా ఫలితం రాకపోవచ్చు. అయితే వివాహం వల్ల వీరి కష్టానికి ఫలితం వస్తుంది. వీరికి మంచి భాగస్వామి తోడుగా దొరుకుతారు. పెళ్లి తర్వాత ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు.
మూల సంఖ్య 2, 5, 9 ఉన్నవారిని 7 అంకె వారు పెళ్లి చేసుకుంటే మంచిది. వీరికి వారికి బాగా సెట్ అవుతుంది. 2 తేదీల్లో పుట్టిన వారికి చంద్రుడికి దగ్గర సంబంధం ఉంటుంది. వీరు చాలా సున్నితమైన స్వభావం గలవారు. అలాగే భావోద్వేగాలను ఈజీగా అర్థం చేసుకుంటారు. అయితే వీరికి 7 అంకె ఉన్నవారికి బాగా సెట్ అవుతుంది. అలాగే 5 అంకె వారికి కూడా బాగా సెట్ అవుతుంది. ఈ సంఖ్య బుధుడికి సంబంధించింది. వీరు చాలా తెలివైన వారు. అన్ని విధాలుగా కూడా వేగంగా ఆలోచిస్తారు. వీరితో పాటు 9 అంకె వారు కూడా 7 నంబర్‌కి బాగా సెట్ అవుతారు. ఈ సంఖ్య అంగారకుడికి సంబంధించింది. వీరు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. వీరిని 7 నంబర్ వారు పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని న్యూమరాలజీ చెబుతుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు
-
Holy Bath: కొత్త జంటలు పుణ్య స్నానం ఆచరిస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్
-
Zodiac signs: నవ పంచమి ప్రభావం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే
-
Pournami: వెరీ పవర్‌ఫుల్ పౌర్ణమి.. ఈ నియమాలు పాటిస్తే విజయం తథ్యం