Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే
Success Tips: ధనవంతులు కావాలంటే రోజంతా కష్టపడితే కారు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలి. డబ్బును రెట్టింపు చేయడానికి ఏం చేయాలని ఆలోచించాలి. అయితే మీరు ధనవంతులు కావాలని అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.

Success Tips : ధనవంతులు కావాలని, బాగా డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. దీంతో ఎంతో కష్టపడతారు. కొందరికి ప్రతిఫలం వచ్చినా కూడా నిలుపుకోలేరు. మరికొందరు నిలుపుకుంటారు. ఇలా నిలుపుకున్న వారే ధనవంతులు అవుతారు. అయితే ధనవంతులు కావాలంటే రోజంతా కష్టపడితే కారు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయాలి. డబ్బును రెట్టింపు చేయడానికి ఏం చేయాలని ఆలోచించాలి. అయితే మీరు ధనవంతులు కావాలని అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.
పొదుపు
చాలా మందికి ఖర్చు చేయడం అలవాటే. కానీ పొదుపు చేయడం అసలు రాదు. మీకు వచ్చిన మొత్తంలో కొంద పొదుపు చేసిన తర్వాతే ఖర్చు పెట్టడం మొదలు పెట్టాలి. అప్పుడే మీ డబ్బు ఉంటుంది. బాగా లాభాలను ఇచ్చే వాటిలో పొదుపు చేస్తేనే మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
నిరంతరం పెట్టుబడి
మంచి లాభాలు రావాలంటే నిరంతరం కూడా పెట్టుబడులు పెట్టాలి. స్టాక్ మార్కెట్లు, సిప్‌లు ఇలా ప్రతీ దాంట్లో పెట్టుబడులు పెడితేనే మీ డబ్బు వృద్ధి చెందుతుంది. కొన్ని సార్లు స్టాక్ మార్కెట్లు లాభాలు వస్తే.. కొన్నిసార్లు నష్టాలు వస్తుంటాయి. అయితే మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు పెట్టుబడులు బాగా పెట్టండి.
లక్ష్యాలు పెట్టుకోండి
ఆర్థికంగా లక్ష్యాలు పెట్టుకోండి. నేను ఇల్లు కొనాలి, కారు కొనాలి, డబ్బులు సేవ్ చేయాలని పెట్టుకోండి. దీనివల్ల మీరు ప్రతీ నెల సిప్‌లో అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల మీకు డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే మీ డబ్బులు కూడా వృద్ది చెందుతాయి.
ఖర్చులు రాసుకోండి
కొందరు దుబారాగా ఖర్చు చేస్తుంటారు. అయితే మీరు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి ఎందుకు ఖర్చు చేస్తున్నారో రాయండి. దీనివల్ల మీరు వృథాగా ఖర్చు పెట్టరు. మీరు పెట్టిన రూపాయి విలువ మీకు తెలుస్తుంది. దీంతో ఇంకోకసారి ఖర్చు చేయకుండా ఉంటారు. అవసరం అయిన వాటికి మాత్రమే ఖర్చు చేస్తారు.
జీవనశైలి
ఆదాయం పెరిగే కొలది కొందరు ఖర్చు పెడతుంటారు. అయితే ఆదాయంతో ఖర్చులు పెరగడంతో పాటు పొదుపు కూడా పెరగాలి. అలాగే పెట్టుబడులు కూడా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎంత సంపాదించారనేది ముఖ్యం కాదు.. ఎంత పొదుపు చేశారనేదే ముఖ్యం. కాబట్టి ఖర్చులతో పాటు పొదుపు కూడా చేయండి.
వేర్వేరు ఆదాయ మార్గాలు
కేవలం ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. ఎక్కువ వాటిలో పెట్టుబడులు పెట్టండి. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీ సంపద పెరుగుతుంది. మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీరు కూడా ధనవంతులు జాబితాలో తప్పకుండా ఉంటారు.
సెర్చ్ చేయండి
డబ్బు సంపాదించడానికి ఎక్కువగా సెర్చ్ చేయండి. ఏం చేస్తే ఆదాయం వృద్ధి చెందుతుందని ఆలోచించండి. మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఎందులో అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేయండి.
-
Ear Hair: చెవి వెంట్రుకల బట్టి వ్యక్తిత్వం.. ఈజీగా చెప్పేయచ్చు
-
Feel Shocked: టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?
-
Drink The Water: ఈ చెట్టు ఆకు వాటర్ తాగితే.. చిటికెలో అనారోగ్య సమస్యలన్నీ పరార్
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?