Mumbai Train Blasts Case: ముంబై రైలు పేలుళ్ల కేసులో షాకింగ్ తీర్పు
Mumbai Train Blasts Case జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం, ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలు నిందితులను దోషులుగా నిరూపించడంతో పూర్తిగా విఫలమయ్యాయని తేల్చింది.

Mumbai Train Blasts Case: ముంబై రైలు పేలుళ్లు దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేశాయి. ఈ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు.దర్యాప్తు తర్వాత 2015లో 12 మందికి స్పెషల్ కోర్టు దోషులుగా తీర్పు ఇస్తూ శిక్షలు ఖరారు చేసింది.
జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం, ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలు నిందితులను దోషులుగా నిరూపించడంతో పూర్తిగా విఫలమయ్యాయని తేల్చింది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించలేకపోయింది. అందుకే వారి శిక్షను రద్దు చేస్తూ, వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని తెలిపింది.
Related News