Vice President Jagdeep Dhankhar Resigned: ఉపరాష్ట్రపతి రాజీనామాకు కారణం ఇదే..
Vice President Jagdeep Dhankhar Resigned కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ధన్ కర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

Vice President Jagdeep Dhankhar Resigned: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం దేశ రాజకీయల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ధన్ కర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.
ఈ క్రమంలో తన పదవీ కాలంలో సపోర్ట్ చేసిన, సహకారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దైవ నిర్ణయానికి లోబడి, 2027 ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకొని పదవీ విరమణ చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.