Astrology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు జాగ్రత్త.. ఎక్కువగా ప్రేమలో మోసపోతారట!

Astrology:
ప్రేమించడం కంటే ఇతరులతో ప్రేమించబడాలంటే కాస్త అదృష్టమే ఉండాలి. ఎలాంటి టెన్షన్‌లో ఉన్నా కూడా స్వచ్ఛమైన ప్రేమ మనతో ఉంటే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. పెద్ద సమస్యలు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ప్రేమకు దగ్గర అవుతారు. వీరు ఒక్కసారి ప్రేమిస్తే జీవితంలో మరిచిపోలేరు. వారినే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం పోవడమే కానీ.. మోసం చేసే ఆలోచనే వారికి ఉండదు. ఒకవేళ మోసపోతే మాత్రం అమ్మాయిలు తీవ్రమైన నరక వేదన అనుభవిస్తారు. ఎల్లప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్లు ఉంటారు. అయితే కొన్ని తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీరు ప్రేమ విషయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉందట. ప్రతీ నెలలోని 2, 5, 7, 11, 12, 14, 17, 20, 24, 25, 27, 29 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు తప్పకుండా ప్రేమ విషయంలో మోసపోతారు. ఎందుకంటే వీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. దీంతో ఎవరు ఏం చెప్పినా కూడా ఈజీగా నమ్మేస్తుంటారు. దీంతో ఇతరులు వీరిని తొందరగా మోసం చేస్తుంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కువగా చెడ్డ వ్యక్తులను ఇష్టపడతారు. ప్రేమ, బంధం విలువ తెలియని వారిని ఇష్టపడటం వల్ల తొందరగా ప్రేమ విషయంలో మోసపోతారు. ఎలాగైనా పార్ట్‌నర్‌ను మార్చాలని భావిస్తారు. కానీ చివరకు వీరే వారి చేతిలో మోసపోతారు. ఇలా ప్రేమలో మోసపోయి చివరకు మానసికంగా ఇబ్బంది పడతారు. బాగా కుంగిపోయి ఆవేదన చెందుతారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మగవాళ్లకు తొందరగా ఎట్రాక్ట్ కూడా అవుతారు.
అమ్మాయిలు ప్రేమలో మోసపోతే చాలా బాధపడుతుంటారు. ఎవరితో మాట్లాడకుండా డిప్రెషన్‌లో ఉంటారు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటారు. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు కూడా బాధతో ఒంటరిగా ఉండిపోతారు. డిప్రెషన్‌లోకి ఎక్కువగా వెళ్లిపోతారు. దీని నుంచి విముక్తి పొందాలంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇతరులతో మాట్లాడటం వంటివి చేస్తే మీరు డిప్రెషన్ నుంచి బయట పడతారు. ఒకే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే మాత్రం ఇంకా మానసిక సమస్యల బారిన పడతారు. అదే అన్ని విషయాలు మర్చిపోయి.. అందరితో కలిసి తిరిగితే మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. మీకు తెలియని కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీకు ఆలోచనలు మారుతాయి. ఒంటరిగా కూర్చుంటే అదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇతరులతో కలిసి సంతోషంగా ఉండండి. దీనివల్ల మీరు డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడతారు.