Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఇంటికి ఈ వస్తువులు తీసుకువస్తే.. ఇక అంతే సంగతులు
Akshaya Tritiya కత్తి అనేది మనిషిని హింసించేది. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది. కత్తిని ఎక్కువగా కోయడానికి వాడుతారు. అయితే ఇలాంటి కత్తిని అక్షయ తృతీయ నాడు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి.
Akshaya Tritiya: హిందువులకు అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ పండుగ రోజు తప్పకుండా నిర్వహిస్తారు. ఈ అక్షయ తృతీయను శుభకరంగా భావిస్తారు. దీంతో అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని.. కొత్త పనులు ప్రారంభిస్తారు. అన్ని మంచి పనులను కూడా ఈ రోజే ప్రారంభిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఏప్రిల్ 30వ తేదీన ఈ ఏడాది అక్షయ తృతీయను నిర్వహిస్తారు. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటివల్ల అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే తృతీయ నాడు కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదట. తెలిసో తెలియక కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లోకి దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. అయితే అక్షయ తృతీయ నాడు ఇంటికి ఏయే వస్తువులు తీసుకురాకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
కత్తి
కత్తి అనేది మనిషిని హింసించేది. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది. కత్తిని ఎక్కువగా కోయడానికి వాడుతారు. అయితే ఇలాంటి కత్తిని అక్షయ తృతీయ నాడు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. ఎలాంటి పనిలో అయినా కూడా ఆటంకం ఏర్పడేలా చేస్తుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కత్తిని తృతీయ నాడు అసలు ఇంటికి తీసుకురాకూడదట.
సూది
ఈ సూదిని కూడా హింసకు వాడుతారు. ఇలా హింసను ప్రేరేపించే వాటిని అక్షయ తృతీయ నాడు అసలు తీసుకురాకూడదని నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకొస్తే.. ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. అసలు సంతోషమే ఉండదు. ఏదో ఒక కారణం చేత ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. కనీసం హ్యాపీనెస్ కూడా ఉండదని పండితులు అంటున్నారు.
బాణం
ఈ బాణాన్ని కూడా హింస కోసం వాడుతారు. బాణంతో పక్షులను వల వేస్తారు. మనుషులను హింసించే వాటిని అసలు అక్షయ తృతీయ నాడు ఇంటికి తీసుకురాకూడదని పండితులు అంటున్నారు. వీటివల్ల ఇంట్లో సమస్యలు రావడం, హ్యాపీనెస్ లేకపోవడం, ప్రతీ పనిలో ఆటంకం, అసలు విజయమే లేకపోవడం వంటి సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. కాబట్టి తృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఇంటికి అసలు తీసుకురావద్దు.
కొడవలి
దీన్ని కూడా మనిషిని చంపడానికి వాడుతారు. ఇలాంటి హానికరమైన వాటిని ఇంటికి తీసుకొస్తే సమస్యలు వస్తాయి. అలాగే అన్ని పనుల్లో కూడా ఆటంకం ఏర్పడుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.



