Maha Sivaratri: శివుడిని ఈ సమయంలో మహా శివరాత్రి నాడు పూజిస్తే.. కోరికలు నెరవేరడం పక్కా

Maha Sivaratri: శివుని భక్తులు ఎంతగానో ఎదురుచూసే మహా శివరాత్రి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రిని భక్తులు జరుపుకుంటారు. పరమ శివుడిని భక్తితో పూజించడం వల్ల చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన మహా శివరాత్రి నాడు భక్తులు ఎంతో పవిత్రంగా శివుడిని పూజించాలి. మహా శివరాత్రి నాడు ఆలస్యంగా నిద లేవకుండా తొందరగా నిద్రలేవాలి. ఉదయం వేకువ జామునే నిద్ర లేచి పూజ చేయాలి. వేకువ జామున లేచి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించి ఎలాంటి కల్మషం మనస్సులో లేకుండా శివుడిని పూజించాలి. శివుడిని ఫస్ట్ అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేసి పూజను ప్రారంభించాలి. శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం కుదిరితే వెళ్లవవచ్చు. లేకపోతే ఇంట్లోనే శివలింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేయాలి. పెరుగు, పాలు, పంచదార, చెరకు రసం, పువ్వులు, బిల్వ పత్రాలు, చందనం ఇలా అన్నింటితో మొదటి శివుడిని అభిషేకం చేయాలి. ఆ తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి భక్తితో శివుడిని ధ్యానించాలి. ఓం నమ: శివాయ అంటూ శివుడిని భక్తితో పూజించాలి. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మనస్సులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా శివుడిని పూజించాలి. అప్పుడే పుణ్యం లభిస్తుంది. లేకపోతే మీరు ఎంత భక్తితో పూజ చేసినా కూడా శివుడు వరాలు ఇవ్వడు.
మహా శివునికి అభిషేకం చాలా ఇష్టం. మీరు భక్తితో అభిషేకం చేసి ఎలాంటి కోరికలు కోరినా కూడా నెరవేరుతాయి. అయితే శివుడిని ఉదయం సమయాల్లో కాకుండా ప్రదోష కాలంలో అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ప్రదోష సమయంలో అభిషేకం చేస్తే ఎలాంటి పాపాలు అయినా కూడా తొలగిపోతాయి. వీలైతే మహా శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. రుద్రాభిషేకం వల్ల ఎలాంటి పాపాలు, నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుంచి కూడా విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. కాబట్టి మహా శివరాత్రి నాడు శివుడిని భక్తితో పూజించండి. ఎలాంటి చెడు ఆలోచనలకు దారి ఇవ్వకండా మనస్సులో శివయ్య అంటూ ధ్యానం చేయండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.