Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 1152 రోజులుగా నెంబర్ వన్
Ravindra Jadeja ఐసీసీ విడుదల చేసిన కొత్త టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 400 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ స్థానంలో కొనసాగడం ద్వారా అతను అత్యధిక కాలం పాటు ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో నెంబర్ వన్‌గా ఉన్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Ravindra Jadeja: ఒకవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రవీంద్ర జడేజా ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. తాజాగా అతను ఒక ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే, టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో అత్యధిక కాలం పాటు వరల్డ్ నెంబర్ వన్‌గా కొనసాగిన క్రికెటర్‌గా నిలబడ్డారు.. జడేజా ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ లేదా ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. మరి రెడ్ బాల్ క్రికెట్‌లో ఎలా రికార్డు సృష్టించాడో తెలుసా ? ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా ఈ ఘనత సాధించాడు.
మళ్లీ నెంబర్ వన్ స్థానంలో జడేజా
ఐసీసీ విడుదల చేసిన కొత్త టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 400 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ స్థానంలో కొనసాగడం ద్వారా అతను అత్యధిక కాలం పాటు ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో నెంబర్ వన్‌గా ఉన్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
నెంబర్ వన్ స్థానం పదిలం.. జడేజా హవా
రవీంద్ర జడేజా 2022 మార్చి 9న వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 38 నెలలు గడిచాయి. జడేజా ఏకంగా 1152 రోజులుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో మొదటిసారి వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా నిలవడం అతనికి రెండోసారి. అంతకుముందు 2017 ఆగస్టులో ఒక వారం పాటు అతను ఈ స్థానాన్ని అధిరోహించాడు.
జడేజాకు గట్టి పోటీ ఇచ్చిన ఆటగాళ్లు
తాజా టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్‌తో గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. మెహదీ హసన్ మిరాజ్ 327 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మెహదీ హసన్, మార్కో జాన్సెన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మార్కో జాన్సెన్ ఒక స్థానం దిగజారి 294 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ నాలుగో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ ఐదో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో జడేజా తర్వాత మరో భారతీయ ఆల్‌రౌండర్ లేడు. అక్షర్ పటేల్ ఈ జాబితాలో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.