South Africa Eagle: దక్షిణాఫ్రికా నుంచి ఫిన్ లాండ్ కు ఈ గద్ద అసాధారణ ప్రయాణం
South Africa Eagle ఎడారిని దాటిన తర్వాత ఈ ఫాల్కన్ సుడాన్, ఈజిఫ్ట్ మీదుగా ప్రవహించే నైలు నది మార్గాన్ని అనుసరించింది. సముద్రం మీదుగా ప్రయాణించకుండా జాగ్రత్త పడింది.

South Africa Eagle: దక్షిణాఫ్రికా నుంచి ఫిన్ లాండ్ కు ఓ గద్ద అసాధారణ ప్రయాణం చేసింది. దక్షిణాఫ్రికా నుంచి ఫిన్ లాండ్ కు సాగిన 42 రోజుల ప్రయాణాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా నిశితంగా పరిశీలించారు. ఈ ఫాల్కన్ ప్రతిరోజు దాదాపు 230 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఆఫ్రికా భూభాగంపై నిటారుగా ప్రయాణించి ఉత్తరాన ఉన్నటవంటి ఎడారి ప్రాంతానికి చేరుకుంది.
ఎడారిని దాటిన తర్వాత ఈ ఫాల్కన్ సుడాన్, ఈజిఫ్ట్ మీదుగా ప్రవహించే నైలు నది మార్గాన్ని అనుసరించింది. సముద్రం మీదుగా ప్రయాణించకుండా జాగ్రత్త పడింది. సముద్రాన్ని దాటకుండా, సిరియా, లెబనాన్ మీదుగా భూ మార్గంలోనే ప్రయాణించింది. సముద్రపు నీరు ఉప్పుగా ఉండడం వల్ల వాటికి దాహం వేసినా అది తాగేందుకు దానికి పనికిరాదు. అందుకే తన ప్రాణాలను కాపాడుకోవడానికి దాహం తీర్చువోడానికి వీలుగా ఉండే ప్రాంతాల మీదుగా ప్రయాణం సాగించింది.