Delhi : దేశంలోని ఏ నాయకులకు ఎలాంటి భద్రత ఉంది? ఢిల్లీ సీఎం కు ఏ భద్రత కల్పించారు. X, Y, Z, Z+, SPG అంటే ఏమిటి?
Delhi CM Security : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషికి హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు 'జెడ్' కేటగిరీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా తన 15 సంవత్సరాల పదవీకాలంలో 'జెడ్' కేటగిరీ భద్రతను పొందారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారి భద్రత కోసం ఎంత మంది సైనికులను ఉంటారు అని తెలుసుకుందాం?

Delhi : షాలిమార్ ఎమ్మెల్యే రేఖ గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తను ప్రమాణ స్వీకారం చేశారు.అంటే ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందన్నమాట. ఇక ఈ ప్రమాణ స్వీకారంతో, రేఖ గుప్తాకు ఉన్నత స్థాయి భద్రత కల్పిస్తున్నారు. తన భద్రత కోసం సైనికుల బృందాన్ని మోహరించనున్నారు. అయితే ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ భద్రత కల్పిస్తారో మీకు తెలుసా? వివిధ నాయకులకు, సెలబ్రెటీలకు వివిధ రకాల భద్రత కేటగిరీలు ఉంటాయి.
దేశంలోని వీఐపీలు, వీవీఐపీ వ్యక్తుల భద్రతా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే దేశంలోని ప్రత్యేక వ్యక్తులు వివిధ రకాల భద్రతలను పొందుతారు. ఇందులో X, Y, Z, Z+, SPG భద్రత ఉన్నాయి. ముఖ్యమంత్రికి Z కేటగిరీ భద్రత ఉంటుంది. ఇప్పుడు, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు Z కేటగిరీ భద్రతనే అందుకుంటున్నారు? మరి ఇందులో ఎంత మంది సైనికులు భద్రత కల్పిస్తారో తెలుసా?.
ఢిల్లీ సీఎం రేఖ గుప్తా భద్రత ఎలా ఉంటుందంటే?
ఢిల్లీ ముఖ్యమంత్రికి Z భద్రత ఉంటుంది. అంతకుముందు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషికి హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఢిల్లీ పోలీసులు ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా తన 15 సంవత్సరాల పదవీకాలంలో ‘జెడ్’ కేటగిరీ భద్రతను పొందారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వారి భద్రత కోసం ఎంత మంది సైనికులను ఉంటారు అని తెలుసుకుందాం?
బుధవారం సాయంత్రం నుంచి రేఖ గుప్తాను ముఖ్యమంత్రిగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి షాలిమార్ బాగ్‌లోని ఆమె నివాసం వద్ద స్థానిక పోలీసులను మోహరించారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే Z భద్రత కల్పిస్తారు. అయితే, భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని హోం మంత్రిత్వ శాఖ భావిస్తే, ఆ మంత్రిత్వ శాఖ అదనపు సూచనలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇప్పుడు Z భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. Z భద్రత మూడవ అతిపెద్ద భద్రత. మొదటిది SPG, రెండవది Z+. దేశ ప్రధానమంత్రిని రక్షించే బాధ్యత SPG అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పై ఉంటుంది. దీనికి పోలీసు డిజి స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. ఎస్పీజీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అదే సమయంలో, 55 మంది సైనికులను Z ప్లస్ కేటగిరీ భద్రతలో చేర్చారు. ఇందులో NSG అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటుంది. వారు శత్రువును క్షణంలో చంపేయడంలో నిపుణులు. ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ఈ భద్రత ఉంది.
ఇక Z భద్రత గురించి చూస్తే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రికి వచ్చిన ఈ భద్రతలో 22 మంది సిబ్బందితో Z భద్రత లభిస్తుంది. ఇందులో కమాండోలతో పాటు పోలీసు సిబ్బంది, 8 మంది సాయుధ సిబ్బంది, వ్యక్తిగత భద్రతా అధికారులు, ఎస్కార్ట్‌లు, వాచర్లు ఉన్నారు.
ఇప్పుడు భద్రత పొందుతున్న వ్యక్తి దానికి డబ్బు చెల్లించాలా వద్దా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ భద్రతను ప్రైవేట్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తికి, వ్యాపారవేత్తలు కూడా పొందితే వారు చెల్లించాల్సి ఉంటుంది. అంటే యోగా గురువు బాబా రాందేవ్, నటుడు ఆమిర్ ఖాన్ లకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. సో వీరు చెల్లించాల్సిందే. ఇక ప్రభుత్వంతో సంబంధం ఉన్న VIPలు, VVIPలు దీనిని చెల్లించాల్సిన అవసరం లేదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.