Airplane Windows: విమానం కిటికీలు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో తెలుసా.. అసలు కారణం ఇదే…
Airplane Windows విమానం వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో విండో గాలి ఒత్తిడిని తట్టుకోలేక వాటిపై త్వరగా పగుళ్లు వస్తున్నాయి. అయితే గుండ్రంగా ఉండే విండోలు గాలి ఒత్తిడిని సులభంగా తట్టుకుంటాయి.

Airplane Windows: విమాన జర్నీ చేసేటప్పుడు గమనించారా ఎప్పుడైనా.. విమానంలో కిటికీలు గుండ్రంగా ఉంటాయి.. కానీ బస్సులు, రైళ్లలో, ఇతర వాహనాల్లో గుండ్రంగా ఉండవు. అయితే దీనికి కారణాలు ఎంటో చూద్దాం. ఈ ప్రమాదాల నివారణ కోసమే విమానం కిటీలు కేవలం గుండ్రని ఆకారంలో ఉంటాయట. ఇలా ఉండడం భద్రతకు సంబంధించిన కారణాలు ఉన్నాయి. ఓకప్పటితో పోలిస్తే విమానాలు వేగంగా దూసుకెళ్లతున్నాయి.
విమానం వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో విండో గాలి ఒత్తిడిని తట్టుకోలేక వాటిపై త్వరగా పగుళ్లు వస్తున్నాయి. అయితే గుండ్రంగా ఉండే విండోలు గాలి ఒత్తిడిని సులభంగా తట్టుకుంటాయి. దీంతో వాటిపై పగుళ్లు ఏర్పడే అవకాశం లేదు. అందుకే గుండ్రని ఆకారంలో విమానం కిటికీలు ఉంటాయి. దీని ద్వారా ఒత్తడి అనేది విండోలపై ఒకచోటే కేంద్రకృతం కాకుండా కిటీకీ చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. అందుకే బస్సు, కారు, ట్రైన్, మాదిరిగా కాకుండా విమానాల కిటికీల ఇలా గుండ్రని ఆకారంలో తయారు చేస్తున్నారు.