PM Narendra Modi : సునీతా విలియమ్స్‌కు ప్రధాని లేఖ.. భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానం!

PM Narendra Modi :
8 రోజుల పర్యటన కోసం 2024 జూలై 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(International Space Centar) వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలలు అక్కడే చిక్కుకుపోయారు. ఆమెను తీసుకెళ్లిన వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 9 నెలలు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమె స్పేస్ ఎక్స్ క్రూ(Space X Cru)లో బుధవారం(మార్చి 19న) భూమిపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు.
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunitha Williams), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలకు పైగా గడిపిన తర్వాత భూమికి తిరిగి వస్తున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఒక హృదయస్పర్శియైన లేఖ రాశారు. ఈ లేఖ మార్చి 1న రాయగా, మంగళవారం(మార్చి 18న) కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jutendra Singh) దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ లేఖలో, మోదీ ఇలా రాశారు: “మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. 1.4 బిలియన్ భారతీయులు మీ ఆరోగ్యం మరియు మిషన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు.” సునీతా విలియమ్స్‌ను “భారతదేశం అత్యంత ప్రసిద్ధ కుమార్తెలలో ఒకరు”గా అభివర్ణిస్తూ, ఆమె తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లో స్వాగతించడం ఆనందంగా ఉంటుందని ఆయన ఆహ్వానం పలికారు. మోదీ తన యూఎస్ పర్యటనల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసినప్పుడు సునీత గురించి విచారించినట్లు పేర్కొన్నారు. మార్చి 1న ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత పేరు చర్చకు వచ్చినట్లు తెలిపారు. ఆ సంభాషణ ఆమెకు లేఖ రాయడానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు.
సునీత తల్లిని కలిసి విషయం..
సునీత తల్లి బోనీ పాండ్యా ఆమె తిరిగి రాక కోసం ఎదురుచూస్తున్నారని, 2016లో యుఎస్‌లో సునీతతో పాటు ఆమె తండ్రి దీపక్ పాండ్యాను కలిసిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆమె భర్త మైఖేల్ విలియమ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు మరియు సునీతతోపాటు బుచ్ విల్మోర్‌కు కూడా సురక్షిత రాక కోసం ఆకాంక్షించారు.
As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.
“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025