Raj Gopal Reddy: రాజ్ గోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫైర్
Raj Gopal Reddy కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని మల్లురవి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా రాజ్ గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Raj Gopal Reddy: రాజ్ గోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫైర్ అయ్యింది. ఈరోజు ఫోన్ లో మాట్లాడి కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండాలని మల్లు రవి రాజ్ గోపాల్ రెడ్డికి చెప్పనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూలంకషంగా చర్చిద్దామని రాజ్ గోపాల్ రెడ్డికి సూచించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని మల్లురవి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా రాజ్ గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను ప్రతిసారి రాజ్ గోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. క్రమశిక్షణ కమిటీ కూడా రాజ్ గోపాల్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేసింది.
Related News