Hyderabad Rain: మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్
Hyderabad Rain మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి.

Hyderabad Rain: భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే అధికారులు హిమాయత్ సాగర్ గేట్లు తెరవనున్నారు. నీటిని దిగువన ఉన్న మూసీలోకి విడుదల చేయనున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి.
సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సెల్లార్లలోని వాహనాలు నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న మణికొండ మున్సిపల్ కమిషనర్ స్పాట్ కు చేరుకున్నారు. సెల్లార్లలోని నీటిని క్లియర్ చేయించారు. రోడ్లకు గండి కొట్టి, మోటార్లలో సెల్లార్లోని వర్షపు నీటిని క్లియర్ చేశారు. వర్షాల కారణంగా కైరా స్కూలు సమీపంలోని ఓ ఇళ్లు కూలిపోయింది.