Mallareddy IT Raids: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Mallareddy IT Raids ఆన్ లైన్, నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.

Mallareddy IT Raids: మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమానాస్సందంగా భారీ స్థాయిలో నగు లావాదేవీలు జరిగాయని సమాచారం అందిన నేపథ్యంలో మల్లరెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఆన్ లైన్, నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. గతంలో ఈడీ అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహించి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ నేతలని ప్రీతిరెడ్డి కలిసిన క్రమంలో ఆమె నివాసంపై ఐటీ దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
Related News