KTR Comments On Revanth: 50 సార్లు ఢిల్లీకి సీఎం.. రేవంత్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
KTR Comments On Revanth రైతులు పొలాల్లో యూరియా చల్లడానికి లేదని కేటీఆర్ అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

KTR Comments On Revanth: 50 సార్లు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాడని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తెలంగాన రాష్ట్రాన్ని ఫైల్స్ తో కాకుండా.. ఫ్లైట్ బుక్సింగ్స్ తో నడిపిస్తున్నడని ఆరోపించారు. ఈయన ఢిల్లీ యాత్రలకు తెలంగాణ కు ఏం సంబంధం లేదు.. అన్ని అన్నారు. రైతులు ఇబ్బందులు తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదని అన్నారు.
రైతులు పొలాల్లో యూరియా చల్లడానికి లేదని కేటీఆర్ అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, తులం బంగారం ఊసు లేదని అన్నారు. గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి మూడు రోజుల్లో మూడు ఫ్లైట్ లు ఎక్కుతున్నాడని అన్నారు. రేవంత్ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి అని అన్నారు.