MLC Kavitha: కవిత 72 గంటల నిరాహార దీక్ష..
MLC Kavitha రాష్టరంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తుంది.

MLC Kavitha: దీక్ష ప్రారంభించే ముందు తన నివాసంలో పూజలు చేసిన కవిత. అనంతరం భర్త అనిల్ తో కలిసి అత్తమామలు దేవనపల్లి రాంకిషన్ రావు, నవలత దంపతుల ఆశీర్వచనం తీసుకుని నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్టరంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి జాగృతి నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్ష విషయంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగుతారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇందిరా పార్క్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత.. https://t.co/pYMcZKCEco pic.twitter.com/IyojAPenOt
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025
Related News