Telangana Govt DISCOM: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్
Telangana Govt DISCOM వ్యవసాయానికి ప్రభుత్వ విద్యాసంస్థలకు, గుృహజ్యోతి పథానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురాలని.. దీనికి రాష్ట్రమంతా ఓకే యూనిట్ గా కొత్త డిస్కమ్ గా పరిధి ఉండాలని సీఎం తెలిపారు.

Telangana Govt DISCOM: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంసకరణలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. వ్యవసాయానికి ప్రభుత్వ విద్యాసంస్థలకు, గుృహజ్యోతి పథానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురాలని.. దీనికి రాష్ట్రమంతా ఓకే యూనిట్ గా కొత్త డిస్కమ్ గా పరిధి ఉండాలని సీఎం తెలిపారు.
కొత్త డిస్కం ఏర్పాటు వల్ల ఇప్పుడున్న విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి .. జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్నారు. డిస్కంల పునర్ వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న అప్పులభారం తగ్గించాలని సూచించారు. అలాగే సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.