Viral Video: వీడు సర్ఫింగ్ చేస్తుంటే.. బాతుకు కోపం వచ్చింది! చివరకు ఏం జరిగిందంటే..
కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటివి వీడియోలుగా మారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటిదే ఒకటి బాగా చక్కర్లు కొడుతోంది. ఒక హంస (బాతు జాతికి చెందినది) ఒక సర్ఫర్‌ను ఊహించని విధంగా కింద పడేసింది.
Viral Video: కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటివి వీడియోలుగా మారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటిదే ఒకటి బాగా చక్కర్లు కొడుతోంది. ఒక హంస (బాతు జాతికి చెందినది) ఒక సర్ఫర్‌ను ఊహించని విధంగా కింద పడేసింది. అతను కలలో కూడా ఇలా జరుగుతుందని అనుకోని ఉండడు.
మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నాడు. తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించినా పట్టించుకోవడం లేదు. అయితే, అవకాశం దొరికినప్పుడు ఇతర జీవులు తమ ప్రతీకారాన్ని వేరే విధంగా తీర్చుకుంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోనే చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆ వ్యక్తి చాలా అద్భుతంగా సర్ఫింగ్ చేస్తుంటాడు. అదే సమయంలో ఒక బాతు వచ్చి అతని గేమ్ పాడు చేస్తుంది. చివరికి అతను నీళ్లలో పడిపోతాడు.
సర్ఫర్‌కు ఊహించని దెబ్బ
వీడియోలో ఒక వ్యక్తి సరదాగా సర్ఫింగ్ చేయడం కనిపిస్తుంది. అతని స్టంట్స్ చూస్తే తను ఒక ప్రొఫెషనల్ సర్ఫర్ అని అర్థమవుతుంది. కానీ, అతని ఆశలపై నీళ్లు చల్లడానికి ఒక బాతు తయారైంది. అది అతని వెనుకగా ఈత కొట్టడం మొదలుపెట్టింది. మొదట ఆ బాతు తననేమీ చేయలేదని ఆ సర్ఫర్ అనుకున్నాడు. కానీ ఆ బాతు అకస్మాత్తుగా అతని సర్ఫింగ్ బోర్డుపై దాడి చేసింది. దీంతో అతను బోర్డుతో సహా నీళ్లలో దారుణంగా పడిపోయాడు. మళ్లీ లేవడానికి కూడా అతనికి ధైర్యం సరిపోలేదు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ranjeetraiderr15 అనే అకౌంట్ షేర్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి వేల మంది ఈ వీడియోను చూశారు. చాలా మంది కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్.. ఎవరి ఇంటికైనా చెప్పకుండా వెళ్తే ఇలాగే అవుతుందని రాసుకొచ్చాడు. మరొకరు ఇంకా చేసుకో సర్ఫింగ్.. అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్.. ఆ వ్యక్తికి పెద్ద దెబ్బ తగిలి ఉంటుందని రాసుకొచ్చారు. చాలా మంది ఈ వీడియోపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.