Elephants On Srivari Mettu: భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల కలకలం
Elephants On Srivari Mettu మెట్టుమార్గంలోని పంప్ హౌస్ వద్ద ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు.

Elephants On Srivari Mettu: తిరుపతి ఘాట్ రోడ్డులో, అలిపిరి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం తీవ్ర కలకలం రేపింది. మెట్టుమార్గంలోని పంప్ హౌస్ వద్ద ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోవడంతో అవి ఏ వైపుగా వెళుతున్నాయో గుర్తించలేకపోయారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు విభాగాల అధికారులు శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను సుమారు గంట పాటు నిలిపివేశారు. రాష్ట్ర అటవీ, టీటీడీ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.