Elephants: ఆ ఏనుగుల బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Elephants: అనారోగ్య కారణాల వల్ల మొదట విడత కింద నాలుగు కుంకీలను ఏపీకి అప్పగించారు. అయితే వీటి పూర్తి తనదేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. వాటి బాగోగులను దగ్గర ఉండి చూసుకుంటానని పవన్ కళ్యాన్ తెలిపారు. వీటిని ఏపీకి అందించినందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో వీటికి ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, వీటిని ఏం జరిగినా నేనే బాధ్యుడు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. దేవా, అభిమన్యు, కృష్ణ, మహేంద్ర అనే నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. వీటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్‌లో ఉంచుతారు.
కుంకీ అంటే?
కుంకీ అనేది ఒక పర్షియన్ పదం. ఇది కుమక్ అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. పర్షియన్‌లో కుమక్ అంటే సాయం అని అర్థం. అయితే బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో తిరుపతి, చిత్తూరు వంటి జిల్లాలలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుంపులు గుంపులుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తుంటాయి. అలాగే గ్రామాల్లోకి ప్రవేశించి మనుషులను తొక్కేస్తుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించమని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగారు. అయితే అడవి ఏనుగులను అడ్డుకునే విధంగా ఈ కుంకీ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అడవి ఏనుగుల గుంపు దాడి చేస్తే వెంటనే కుంకీ ఏనుగులను పంపిస్తారు. అలా ఈ ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు.
Read Also: ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
కుంకీ ఏనుగులు ప్రత్యేకమైనవి
కేవలం మగ ఏనుగులను మాత్రమే కుంకీలుగా ఉపయోగిస్తారు. కుంకీ ఏనుగులుగా ఉండాలంటే వాటికి కాస్త బలం ఎక్కువగా ఉండాలి. భారీ వస్తువులను కూడా మోయాలి. అందుకే మగ ఏనుగులను మాత్రమే కుంకీలుగా మారుస్తారు. ఈ కుంకీ ఏనుగులు చాలా ప్రత్యేకమైనవి. ఇవి మనుషులు ఆదేశాలను తప్పకుండా పాటిస్తాయి. ఏనుగు సంరక్షకుడు ఏ ఆదేశాలు జారీ చేస్తే అవే చేస్తాయి. ఈ ఏనుగులు మనుషులతో కూడా చాలా క్లోజ్‌గా ఉంటాయి. అయితే ఎక్కువగా ఆసియా ఏనుగులను కుంకీల కోసం ఎంపిక చేస్తారు.
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Pawan Kalyan : పవన్ సినిమా కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పవర్ స్టార్ రేంజే వేరు
-
Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?